సొంత నియోజకవర్గానికి జగన్ వెళ్లడంట!

by Anukaran |
సొంత నియోజకవర్గానికి జగన్ వెళ్లడంట!
X

దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన ఖారారైంది. కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 7న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుని అతిథి గృహంలో బస చేయనున్నారు. 8న ఉదయం వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాలుళర్పించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ట్రిబుల్ ఐటీకి చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అకాడమీ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సోలార్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. తదనంతరం కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరనున్నారు. అధికారికంగా పర్యటన ఖరారు కావడంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరు నెలల తర్వాత సీఎం సొంత జిల్లాకు రానుండటంతో పఠిష్టమైన చర్యలు చేపట్టారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో సీఎం పర్యటనకు పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతిoచనున్నారు. సీఎం పర్యటనకు వెళ్లే అధికారులకు, పాత్రికేయులకు కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. టెస్ట్ లో నెగెటివ్ వస్తేనే పర్యటనకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సీఎం తన సొంత నియోజకవర్గానికి వెళ్లడం లేదు.

Advertisement

Next Story

Most Viewed