- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా ఉన్నాం: సీఎం జగన్
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవాపథకాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ నిధులు చెల్లించారు. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,191 కోట్లను సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. పంటల సాగు కోసం వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తుందని అలాగే బ్యాంకులలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోందని వెల్లడించారు. తాజాగా సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందుకోసం 40 శాతం సొమ్మును సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తోందని సీఎం జగన్ తెలిపారు.
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
‘రైతుల కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని’ సీఎం జగన్ స్పష్టం చేశారు.
కల్తీ విత్తనాలు అరికట్టేందుకు చర్యలు
‘రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కల్తీ విత్తనాలు బారినపడి రైతన్న నష్టపోకుండా ఉండేందుకు కఠినచర్యలు తీసుకుంటున్నాం. రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. నాణ్యమైన కరెంటు సరాఫరాకు రూ.18 వేల కోట్ల వ్యయం అవుతోంది. విద్యుత్ సరఫరా కోసం రూ.1700 కోట్లతో ఫిడర్ల మార్పు చేశాం. రూ.3వేల కోట్ల వ్యయంతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు రూ.2వేల కోట్లతో నిధి ఏర్పాటు చేశాం. ధాన్యం సేకరణకు రెండేళ్లలో రూ.35 వేలకోట్లు ఖర్చు చేశాం. పత్తిపంట కొనుగోలుకు రూ.1800 కోట్ల ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోలుకు రూ.6,434 కోట్ల వ్యయం చేశాం’ అని సీఎం జగన్ తెలిపారు.