గుడ్‌ న్యూస్.. ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల

by Anukaran |   ( Updated:2021-06-18 02:19:24.0  )
cm-jagan mohanreddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీఎం జగన్ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. 2021-22 ఏడాదికి గాను వివిధ శాఖల్లో 10, 143 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే జులై నెలలో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇచ్చింది. ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌ 1,2కి చెందిన మరో 36 పోస్టులు, సెప్టెంబర్‌లో పోలీస్ శాఖలో 450 పోస్టులు, అక్బోబర్‌లో వైద్యశాఖలో 451 పోస్టులు, నవంబర్‌లో వైద్యశాఖలోని 5,251 పారామెడికల్ పోస్టులు, డిసెంబర్‌లో 441 నర్సుల పోస్టులు, వచ్చే ఏడాది జనవరిలో 240 డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టులు, అదే సంవత్సరం ఫిబ్రవరిలో వివిధ యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ పోస్టులు, ఇక మార్చిలో వివిధ శాఖలకు చెందిన మరో 36 పోస్టుల నోటిఫికేషన్లకు సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed