- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చారు: అనిత
దిశ,విశాఖపట్నం: రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖలో ఆదివారం ఆమె మాట్లాడుతూ… సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులలోని లింగాల మండలంలోని పెదకూడాల గ్రామంలో 48ఏండ్ల దళిత మహిళ పై అతిదారుణంగా అత్యాచారం జరిగితే, వైసీపీ మహిళానేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
18నెలల జగన్ పాలనలో అధికారిక లెక్కల ప్రకారమే రోజూ ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో దళిత మహిళపై అత్యాచారం చేసి, చంపేస్తే ముఖ్యమంత్రి పట్టించుకోరా? ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన దారుణంపై చంద్రబాబు, డీజీపీకి లేఖరాస్తే, ఇంతవరకు స్పందన లేదన్నారు.
ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నల్లిని నలిపినట్లు నలిపేసిందన్నారు. వైసీపీవారు చెప్పింది చేయడానికే పోలీసులు పరిమితమయ్యారని ఆరోపించారు. నిబద్ధత, జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే, రాష్ట్రంలో నేరాలశాతం పెరిగిందని తీవ్రంగా విమర్శించారు. నిత్యం ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, మహిళా హోంమంత్రి, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్, వైసీపీ మహిళా నేతలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.