పోలవరంపై ప్రధానికి జగన్ లేఖ..!

by srinivas |
పోలవరంపై ప్రధానికి జగన్ లేఖ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించడంపై ప్రధాని మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయనున్నారు. అందులో భాగంగానే సోమవారం ప్రధానితో పాటు, ఆర్థిక, జలశక్తి శాఖ మంత్రులకు లేఖలు రాయాలని నిర్ణయించారు. పోలవరం నిర్మాణం అంచనా వ్యయాన్ని తగ్గిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై లేఖ ద్వారా ముఖ్యమంత్రి కేంద్రానికి వివరించనున్నారు.

అంతేకాకుండా, గత టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చ జరిపిన అంశాలను ఎందుకు గోప్యంగా ఉంచిందని జగన్ ఆరా తీశారు. పోలవరం విషయంలో ప్రతీ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీఎం గుర్తుచేశారు.

Advertisement

Next Story