చిన్నారులకు 9 రకాల వ్యాక్సిన్‌ లు.. సిద్దం చేసిన ఏపీ ప్రభుత్వం

by srinivas |   ( Updated:2021-08-25 06:28:03.0  )
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో నెలల చిన్నారికి వైద్యారోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్‌ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు పీసీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చిన్నారులకు 9 రకాల వ్యాక్సిన్‌లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అందిస్తోంది. తాజాగా ఇస్తున్న న్యుమోకోకల్‌ వ్యాక్సిన్‌తో కలిపి మెుత్తం పది రకాల వ్యాక్సిన్‌లు చిన్నారులకు ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed