- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమ్యూనలిస్టులుగా మారిన కమ్యూనిస్టులు : జగన్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. మంగళవారం కూడా టీడీపీ, వైసీసీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా టీడీపీ నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో 12 మంది సభ్యులను రెండోరోజూ స్పీకర్ సస్పెండ్ చేశారు.
అనంతరం నిర్వహించిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని కమ్యూనిస్టు నేతలు కూడా వారికి వంతపాడుతూ కమ్యూనలిస్టులుగా మారారని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల పంపిణీ చేయకుండా చంద్రబాబు కావాలనే టీడీపీ నేతలతో కోర్టులో కేసులు వేయిస్తున్నాడని జగన్ మండిపడ్డారు. దీనివలన 24 లక్షల మంది పేదలకు ఇళ్లు అందలేదన్నారు. సీఆర్డీఏ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నించామని, కానీ కులాలు, వర్గాల సమీకరణాలు మారిపోతాయంటూ టీడీపీ నేతలు కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. లబ్దిదారులకు చూపించిన తర్వాతే ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.విశాఖలో ల్యాండ్ పూలింగ్ చేస్తుంటే టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు అడ్డుకున్నాయని, చంద్రబాబుకు వారికి మధ్య ఒప్పందం జరిగిందన్నారు.