అంగన్‌వాడీ టీచర్లకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

by srinivas |
Anganwadi teachers
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అర్హతలు కలిగిన వారికి తప్పనిసరిగా ప్రమోషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యావిధానంపై అధికారులతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం ప్రకారం పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 14వేల పాఠశాలలు అదనంగా అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు.

కొత్త విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం సూచించారు. వర్గీకరణతో విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడతారని సీఎం వివరించారు. ఈవిధానం ద్వారా ఉపాధ్యాయులకు పనిభారం కూడా తగ్గుతుందన్నారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని జగన్‌ ఆదేశించారు. కొత్త విద్యావిధానం, నాడు-నేడుకు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. కొత్త విద్యావిధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed