- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో ఫిషింగ్ హార్బర్లకు సీఎం శ్రీకారం
దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు సమకూర్చే బృహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంతంలో తొలిదశ కింద రూ.1510 కోట్ల వ్యయంతో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. నాడు పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందులను సీఎం జగన్స్వయంగా పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో మెరుగైన మౌలిక వసతులను కల్పించడంకోసం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మొదటి దశలో నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో హార్బర్లు నిర్మిస్తారు. ఈపాటికే టెండర్లను ఆహ్వానించారు. డిసెంబర్ రెండో వారంలో వీటిని ఖరారు చేస్తారు. రెండో దశలో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తారు. మొత్తం 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చించనున్నారు.