- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప జిల్లా రుణం తీర్చుకోలేను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్
దిశ, ఏపీ బ్యూరో : ‘వైఎస్ఆర్ కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకువస్తా. అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతా. ఈ ప్రజల ఆదరాభిమానాలు నన్ను ఇంతటి స్థాయికి తీసుకువచ్చాయి. నా కష్టాల్లోనూ.. బాధల్లోనూ నా వెంట నడిచిన ప్రతి సోదరునికి.. సోదరికి కృతజ్ఞతలు చెప్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం బొల్లవరంలోని బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్ ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితోపాటు ఇతర ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రొద్దుటూరు మండలం గోపవరం చేరుకున్నారు. అక్కడ కాసేపు స్థానిక నాయకులతో ముచ్చటించారు. ఆ తర్వాత బొల్లవరంలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
‘ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మన ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.326 కోట్లు నగదు బదిలీ చేసింది. అలాగే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశాం. 22 వేల 212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతం చేశాం. అలాగే తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్నాం. ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లను, శిథిలావస్థకు చేరుకున్న డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. ఇందులో భాగంగా రూ.163 కోట్లు కేటాయించాం. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53 కోట్లు మంజూరు చేశాం. ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.