- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ వైసీపీ నేతలకు జగన్ క్లాస్..?
దిశ, విశాఖపట్నం: విశాఖ వైసీపీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల పంచాయితీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ చేరుకున్నారు. ఇటీవల విశాఖ డీఆర్సీ సమావేశంలో జరిగిన భూ ఆక్రమణలు, నాడు-నేడు అవినీతిపై ఎంపీ, ఎమ్మెల్యేలు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. ఈ అంశం మీడియాలో రావడంతో సీఎం జగన్ ముగ్గురినీ పిలిపించారు. ఏం జరిగిందన్న అంశంపై ముగ్గురిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి పనిచేయాలంటూ ముగ్గురు నేతలకు సీఎం జగన్ ఆదేశించారు.
జరిగిన ఘర్షణ ఇదే….
విశాఖలో డీఆర్సీ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.అయితే ఏం జరిగిందో ఏమోగానీ ఒక్కసారిగా ఎంపీ విజయసాయిరెడ్డిపై.. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేరుగానే విరుచుకుపడ్డారు. అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ముందే విజయసాయి తీరును ఎండగట్టారు. మరోవైపు.. ఇదే సమావేశంలోనే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘నాడు-నేడు’ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. అధికారులు చిన్నచూపు చూస్తున్న వైనాన్ని జిల్లా అభివృద్ధి సమీక్షామండలి సమావేశంలో వివరించారు.
సమన్వయంతో పనిచేయండి
విశాఖలో జరిగిన గొడవకు సంబంధించి హూటాహూటిన ఎంపి విజయసాయిరెడ్డితో పాటు, ఎమ్మెల్యేలు ధర్మాన, గుడివాడ అమర్‌నాథ్‌లు వెళ్లడంతో సిఎంను కలిశారు. విభేధాలు పక్కన పెట్టి, అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఏదైనా సమస్య ఉంటే ఇన్‌చార్జి మంత్రి, సీనియర్ మంత్రుల దృష్టికి తీసుకురాకుండా అంతర్గత విభేదాలపై బహిరంగంగా చర్చిస్తే ఎలా అంటూ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.