AP News:పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-28 11:38:46.0  )
AP News:పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు ప్రభుత్వ పథకాల పేర్లు మార్చిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు అభినందనలు తెలిపారు. స్ఫూర్తి ప్రదాతల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు తాజాగా స్పందిస్తూ..‘విద్యాశాఖ అమలు చేసే పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, డాక్టర్ అబ్దుల్ కలాం వంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల పేర్లు పెట్టడాన్ని స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆ పేర్లు ప్రతిపాదించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు’ అంటూ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Advertisement

Next Story