క్లబ్‌హౌస్‌లో పేమెంట్స్ ఫీచర్

by Shyam |
Payments
X

దిశ, ఫీచర్స్: అమెజాన్, వాట్సాప్, జియో వంటి పాపులర్ యాప్స్ అన్నీ క్రమంగా ‘పేమెంట్స్’ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైరల్ ఆడియో చాట్ యాప్ క్లబ్‌హౌస్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇకపై ఈ ప్లాట్‌ఫామ్‌లో హోస్ట్ చేసే ప్రదర్శనలకు వినియోగదారులు నేరుగా పేమెంట్స్ చేసుకోవచ్చు. క్లబ్‌హౌస్ తమ బ్లాగ్‌పోస్ట్‌లో ఇదే విషయాన్ని ధృవీకరించింది.

ప్రస్తుతం క్లబ్‌హౌస్ వినియోగదారుల్లో కొందరికి మాత్రమే ‘పేమెంట్స్’ యాప్ అందుబాటులోకి వచ్చింది. టెస్ట్ రన్ ముగిసిన తర్వాత కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తగిన మార్పులు చేసిన తర్వాత అందరూ వినియోగించుకోవచ్చని క్లబ్‌హౌస్ తెలిపింది. అయితే క్లబ్‌హౌస్ ఏ కరెన్సీలకు మద్దతు ఇస్తుందో స్పష్టంగా తెలియదు, కానీ ప్రారంభంలో మాత్రం యూఎస్ డాలర్లకు పరిమితమవుతుందని సమాచారం. ప్రస్తుతానికి ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే క్లబ్‌హౌస్‌ అందుబాటులో ఉండగా.. డబ్బు సెండ్ చేసినప్పుడు ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ లావాదేవీకి సంబంధించి క్లబ్‌హౌస్ ఏమీ తీసుకోదని, అదంతా ప్రాసెసింగ్ భాగస్వామి ‘స్ట్రైప్’‌కు వెళ్తుందని సదరు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed