ఇళ్లలోనే తరగతి గదులు

by srinivas |   ( Updated:2020-04-12 02:13:27.0  )
ఇళ్లలోనే తరగతి గదులు
X

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయాందోళనల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే. 200 దేశాలను కరోనా కమ్మేసింది. దీంతో దాని వ్యాప్తిని నిరోధించేందుకు భారతదేశం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విద్యాసంవత్సరానికి తీవ్ర ఆటంకమేర్పడింది. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంలో ఇబ్బందులేర్పడ్డాయి. లాక్‌డౌన్ ముగిసిన తరువాత వారికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

మరోవైపు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తరువాతి విద్యాసంవత్సరానికి ప్రమోట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాలు కూడా దీనికే ఓటు వేస్తున్నాయి. అయితే పదవ తరగతి విద్యార్థులు మాత్రం పరీక్షలు పోస్టు పోన్ కావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

పరీక్షలు రెండు సార్లు వాయిదా పడడంతో విద్యార్థులు నిరాశ చెందారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒకసారి, కరోనా మహమ్మారి కారణంగా మరోసారి పరీక్షలు వాయిదా పడడంతో విద్యార్థుల్లో నైరాశ్యం కమ్ముకుంది. పరీక్షలు జరుగుతాయా? జరిగితే ఎప్పుడు జరుగుతాయి? అంటూ ఆందోళన నెలకొంది. దానిని తీసివేసేందుకు రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి, వారెలా చదువుతున్నారు? పాఠాల్లో ఏవైనా అనుమానాలున్నాయా? వంటి వివరాలు చెక్ చేస్తున్నారు. సెలువుల్లో ఉన్నప్పటికీ విద్యార్థుల పట్ల వారు చాటుతున్న ప్రేమకు అభినందనలు కురుస్తున్నాయి.

Tags: school eduction, ap residential scools,10 th exams, phone calls

Advertisement

Next Story

Most Viewed