- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిషర్ మ్యాన్ టు షిప్ మేకర్.. చదివింది ఏడు, మాట్లాడేది 14 భాషలు
దిశ, ఫీచర్స్ : కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ అనగానే గుర్తొచ్చేవి సముద్రపు దీవులు. మొత్తం 39 దీవుల సముదాయంగా ఉండే ఈ యూనియన్ టెరిటరీలో కేవలం పది దీవులు మాత్రమే జనావాసానికి అనుకూలమైనవి. నీలి రంగు సముద్రం, అందులోని జీవరాశులు, తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్య వృక్షాలు, స్థానిక మత్స్యకారుల విలక్షణ సంప్రదాయాలకు ఈ దీవులు ఆలవాలం. ప్రకృతి అందాలతో అలరారుతూ ప్రపంచవ్యాప్త పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘లక్షదీప్’ టూరిజంలో ప్రత్యేకతను చాటుకుంటుండగా.. ఏడో తరగతి మాత్రమే చదివిన స్థానిక వ్యక్తి ఒకరు తన ప్రాంతం గర్వపడేలా చేశాడు. ‘ద మ్యాన్ ఇన్ మిలియన్’గా పిలువబడే తనను భారత ప్రభుత్వం ఇటీవలే ‘పద్మశ్రీ’తో సత్కరించడం విశేషం. అయితే స్కూలింగ్ మధ్యలోనే ఆపేసిన ఆ వ్యక్తి.. మెరైన్ (సముద్రజీవావరణ) పరిశోధకుడిగా, పర్యావరణ పరిరక్షకుడిగా ఎలా మారాడు? 14 భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
లక్షద్వీప్‌లో దక్షిణ భాగాన గల మాలిక్ ద్వీపాన్ని ‘మినీ కాయ్ లేదా మాలిక్ అటల్’ అని కూడా పిలుస్తారు. పూర్తిగా కొబ్బరి, తాటి చెట్లతో నిండిన ఈ ప్రాంతం మత్స్యకారులకు ప్రసిద్ధి. మధ్యయుగంలో అరబ్ షిప్‌ల తయారీకి కావాల్సిన తాళ్లు, ఇతర ముడి పదార్థాలను ఇక్కడ నుంచే సప్లయ్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతానికి చెందిన మానిక్‌ఫన్ చిన్నప్పటి నుంచే తన తాతతో కలిసి చేపల వేటకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే చేపలు ఎలా పట్టాలి? వాటిలో ఏయే రకాలుంటాయి? అనే విషయాలను నేర్చుకున్నాడు. కొద్దిరోజులకు తన తండ్రికి ఉద్యోగరీత్యా కేరళలోని కన్నూరుకు ట్రాన్స్‌ఫర్ అవడంతో అక్కడికెళ్లిన మానిక్‌ఫన్.. ఏడో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత తాతయ్యకు ఫిషింగ్‌లో హెల్ప్ చేస్తానంటూ తిరిగి మినీ కాయ్‌కు వచ్చిన మానిక్‌ఫన్ మళ్లీ పాఠశాలకు వెళ్లలేదు. అప్పటి నుంచి తాతతో కలిసి ఫిషింగ్‌కు వెళ్తూనే అక్కడి దీవిలోని లైట్ హౌజ్, మెటరాలజీ డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్‌గా పనిచేయసాగాడు. ఈ క్రమంలో హైడ్రోజన్ బెలూన్స్ గాలిలో ఎలా ఎగురుతున్నాయో తెలుసుకోవడంతో పాటు star gazing(టెలిస్కోప్ ద్వారా నక్షత్రాల లెక్కింపు, గుర్తింపు) నేర్చుకున్నాడు. ఆయన ప్రతిభను గుర్తించిన మెటరాలజీ అధికారులు 1960లో రామేశ్వరంలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CMFRI)లో ల్యాబ్ బాయ్‌గా ఉద్యోగమిచ్చారు.
మానిక్‌ఫన్ ల్యాబ్ బాయ్‌గా పని చేస్తున్న క్రమంలో ‘సీఎంఎఫ్ఆర్ఐ’లో ఫిషెస్, ఫిషింగ్‌పై అపార జ్ఞానాన్ని సంపాదించాడు. ఇలా 400 రకాల చేపలను చూసి గుర్తించగలిగే ప్రతిభకు ఫిదా అయిన అధికారులు.. ఓ చేపకు అతడి పేరు మీదుగా ‘అబ్యుడెఫ్‌డఫ్ మానిక్‌ఫని(Abdudefduf Manikfani)’ అని పెట్టడం విశేషం. కాగా ‘సీఎంఎఫ్ఆర్ఐ’లో వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న మానిక్‌ఫన్‌ను కలిసిన ఐరిష్ నావికుడు టిమ్ సెవెరిన్.. 1981లో పడవ తయారీకి సూపర్‌వైజ్ చేయాలని కోరాడు. అయితే ఈ పనికి మానిక్‌ఫన్ మాత్రమే సరైన వ్యక్తి అని నమ్మింది మాత్రం ‘సీఎంఎఫ్ఆర్ఐ’ మెరైన్ బయోలజిస్ట్ జోన్స్. ఆయనే మానిక్‌ఫన్‌ను టిమ్‌కు రెకమెండ్ చేస్తూ.. ‘ఈయన స్కూల్ డ్రాప్ అవుట్ కానీ సముద్రయానం, పడవల పట్ల అపార జ్ఞానమున్న వ్యక్తి, 14 భాషలు మాట్లాడగలడు. సింధు సముద్రయానం చేయగలిగే పడవ తయారీకి సహకారమందించగల మ్యాన్ ఇన్ మిలియన్’ అని పేర్కొంటూ లేఖ రాయడం గమనార్హం.
30 మంది కార్పెంటర్ల సహకారంతో ఏడాది పాటు శ్రమించిన మానిక్‌ఫన్, టిమ్.. లోహంతో కాకుండా కలపతో(చెక్క, కొబ్బరిపీచు) 80 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉండే పడవను రూపొందించారు. ఇందుకోసం మినీకాయ్‌లోని నాణ్యత కలిగిన కొబ్బరి పొట్టుతో పాటు ఐని అనే బోట్ తయారీకి వాడే కలపను వాడారు. ఈ షిప్‌కు ఒమన్‌లోని సోహర్ టౌన్ పేరు మీదుగా ‘సోహర్ షిప్’ అని నామకరణం చేశారు. ఇక ఈ షిప్ ద్వారా ఒమన్ నుంచి చైనా వరకు 9,600 కిలోమీటర్లు ప్రయాణించిన టిమ్.. దీన్ని ఒమన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ మ్యారిటైమ్ హిస్టరీలో ప్రదర్శనకు ఉంచడం విశేషం. కాగా మానిక్‌ఫన్ 1982లో ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత తమిళనాడులో ఉంటూ కార్ ఇంజిన్‌ను డిస్‌మ్యాంటిల్ చేసి, బ్యాటరీతో నడిచే సైకిల్‌ను ఆవిష్కరించాడు. సస్టెయినబుల్ అగ్రికల్చర్ ద్వారా 15 ఎకరాల బంజరు భూమిని అడవిగా మార్చాడు. 2011లో కేరళలోని కోజికోడ్ జిల్లా, ఒలవన్న అనే టౌన్‌కు వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మానిక్‌ఫన్.. ఇంగ్లిష్, హిందీ, మలయాళం, అరబిక్, లాటిన్, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్, సింహళీ, పెర్షియన్, సంస్కృతం, తమిళ్, ఉర్దూ వంటి 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడం విశేషం.
నేను స్కూలింగ్ మధ్యలోనే ఆపేసిన మాట వాస్తవమే. కానీ, కొత్త విషయాల లెర్నింగ్ ఎప్పుడూ ఆపలేదు. ప్రకృతి నాకు స్వయం సమృద్ధిగా ఎలా ఉండి అభివృద్ధి కాగలమనేది నేర్పించింది. చుట్టుపక్కల ఉన్న మనుషులు మనకు గురువులే. వారి సంభాషణలు వింటే చాలు మనకు ఆటోమేటిక్‌గా జ్ఞానోదయం కలుగుతుంది.
– అలీ మానిక్‌ఫన్