- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్వీ రమణ అధ్యక్షతన.. ‘సుప్రీం’ కొత్త జడ్జీల ప్రమాణం
న్యూఢిల్లీ: ఇటీవలే నియామకమైన తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు అడిషినల్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో ఉదయం 10:30గంటలకు జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) ఎన్వీ రమణ అధ్యక్షతన వహించనున్నారు. కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్(పీఆర్వో) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. 9మంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనుండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంది. కొవిడ్ నిబంధనల మధ్యనే ఈ వేడుక జరగనుందని తెలిపింది.
కాగా, ఈ నెల 17న సుప్రీంకోర్టు కొలీజియం తొమ్మిది మంది పేర్లను అత్యున్నత న్యాయస్థానానికి జడ్జీలుగా సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వీటికి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించింది. దీంతో తొమ్మిది మంది సుప్రీంకోర్టుకు జడ్జీలుగా నియామకమయ్యారు. మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్న తొమ్మిది మంది పేర్లను పరిశీలిస్తే.. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరీ, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ చుడాలయిల్ థేవన్ రవికుమార్, జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ బేల మాధుర్య త్రివేది, జస్టిస్ పామిడిఘంటం శ్రీ నారసింహా ఉన్నారు.