సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నోటిఫికేషన్

by  |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నోటిఫికేషన్
X

దిశ, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో ఏడాదికి గాను కాంట్రాక్ట్ పద్ధతిలో 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఈ నెల 31న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆడిటోరియంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఇంటర్వ్యూ ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జులై 27న హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు మాత్రం హాజరు కాకుడదని తెలిపారు.

Advertisement

Next Story