రూ.2500ల‌కే సిటీ స్కాన్‌

by Sampath |
రూ.2500ల‌కే సిటీ స్కాన్‌
X

దిశ‌, కాళోజీ జంక్ష‌న్: వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా ప‌రిధిలో ఉన్న అన్ని ఆస్ప‌త్రులు, డ‌యాగ్న‌స్టిక్‌ల‌లో రూ.2500ల‌కే సిటిస్కాన్ నిర్వ‌హించాల‌ని, మంగ‌ళ‌వారం నుంచే ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రావాల‌ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. సోమవారం ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో బెడ్ల స‌దుపాయం, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, త‌దిత‌ర అంశాల‌పై యాజ‌మాన్యాల‌తో క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోజు ఎంత మందిని అడ్మిట్ చేసుకుంటున్నారు?.. ఇంకా ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి? అనే సమాచారం ప్రయివేట్ యాజమాన్యం వారు ఇవ్వాలన్నారు. మీ హాస్పిటల్‌లో బెడ్స్ ఖాళీగా లేకపోతే మీకు తెలిసిన హాస్పిటల్ లో ఖాళీ గా ఉంటే.. దానికి సంబంధించిన సమాచారం పేషంట్ కుటుంబానికి తెలియచేసి సహకరించాలని ప్రయివేట్ హాస్పిటల్స్ వారిని కలెక్టర్ కోరారు.

ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి తేడా వచ్చినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సూచించారు. ఆక్సిజన్ సరఫరా, అందుబాటులో ఉన్న సిలిండర్ వివరాలను ప్రతిరోజూ ఇవ్వాల్సిందిగా డీపీవోకి కలెక్టర్ తెలిపారు. ఏ ఒక్క హాస్పిటల్ లో ఆక్సీజన్ కొరత రాకుండా చూసుకోవాలని ఏజెన్సీ వారిని కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed