- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సిటీ గ్యాస్ భారీ పెట్టుబడి
దిశ, వెబడెస్క్: మౌలిక సదుపాయాలను నెలకొల్పడమే లక్ష్యంగా జమ్మూ, నాగ్‌పూర్, పఠాన్‌కోట్, మదురైలతో సహా 61 ప్రాంతాలలో సిటీ గ్యాస్ రూ.80,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) తెలిపింది. 11వ సిటీ గ్యాస్ లైసెన్సింగ్ రౌండ్‌లో ఆఫర్ చేసిన 65 భౌగోళిక ప్రాంతాలకు డిసెంబర్ 15న బిడ్‌లు వచ్చినట్లు (PNGRB) ఒక ప్రకటనలో పేర్కొంది. 19 రాష్ట్రాల్లోని 215 జిల్లాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి.
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్దిలో సిటీ గ్యాస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రూ.80,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి, ఉపాధిని సృష్టిస్తుందని PNGRB తెలిపింది. 2018-19లో, PNGRB 136 ప్రాంతాలలో ఆటోమొబైల్స్‌కు సిటీ గ్యాస్ రిటైల్ చేయడానికి, ఇంటింటికి పైపుల ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేయడానికి లైసెన్స్‌లను ఇచ్చింది. దీని వలన సిటీ గ్యాస్ నెట్‌వర్క్ కవరేజీ 406 జిల్లాలకు విస్తరించింది. 2030నాటికి సహజవాయువు వాటాను ప్రస్తుతం ఉన్న 6.3 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ జాబితాలో నాగ్‌పూర్, మధురై, రాజస్థాన్‌లోని బికనీర్, చురు జిల్లాలు. తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తమిళనాడులోని నీలగిరి, పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్, ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ మెుదలగునవి ఉన్నాయి.