సీఐఎస్‌సీఈ 10వ,12వ తరగతి పరీక్షలు వాయిదా

by Shamantha N |
సీఐఎస్‌సీఈ 10వ,12వ తరగతి పరీక్షలు వాయిదా
X

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10వ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్‌సీఈ) నిర్ణయించింది. సీఐఎస్‌సీఈ 10వ, 12వ తరగతి పరీక్షలు మే 4న జరగాల్సి ఉన్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా వీటిని వాయిదా వేస్తున్నట్టు సీఐఎస్‌సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రెటరీ గెర్రి అరథూన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

కరోనా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ఈ పరీక్షల నెక్స్ట్ డేట్స్ కోసం జూన్ తొలివారంలో సమీక్షిస్తామని వివరించారు. 12వ తరగతి పరీక్షలు తర్వాతి దశలో నిర్వహిస్తామని, పదవ తరగతి పరీక్షలకు రెండు అవకాశాలిస్తామని పేర్కొన్నారు. ఒకటి 12వ తరగతి విద్యార్థుల తరహాలోనే ఆఫ్‌లైన్‌లో పరీక్షలు రాయడం, లేదంటే బోర్డు రూపొందించిన పద్ధతిలో ఎవల్యుయేషన్ చేసిన ఫలితాలను స్వీకరించడమని తెలిపారు. ఈ అసెస్‌మెంట్ ప్రక్రియపై స్పష్టంగా వివరించలేదు.

Advertisement

Next Story

Most Viewed