- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యంగ్ బ్యూటీ డ్యాన్స్ వీడియో వైరల్.. గ్రూవీ మీకోసమే అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో వేరెవర్ యు గో అనే సాంగ్‌కు చాలా సూపర్‌గా డ్యాన్స్ చేసింది. ఇక దానికి గ్రూవీ మీకోసమే.. ‘ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది రాబిన్ హుడ్ రిలీజ్ కావడానికి’ అనే క్యాప్షన్ రాసుకొస్తూ వైట్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు నితిన్ కూడా ఉండి ఉంటే బాగుండేది అని, చాలా బాగా డ్యాన్స్ చేశారని, మీ డ్రెస్ సూపర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా రాబిన్ హుడ్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పటకీ యూత్ ఫేవరెట్ లిస్ట్‌లో ఈ సాంగ్ తప్పక ఉంటుంది అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యంగ్ బ్యూటీ డ్యాన్స్ వీడియోను మీరు కూడా చూసి తరించండి.
Read More..
‘సూర్య45’ మూవీలో స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఈ కాంబో అస్సలు ఊహించి ఉండరుగా!