- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వావ్ పోస్టర్ అదిరింది గురు.. తమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. దేనిగురించంటే..?

దిశ, వెబ్‌డెస్క్: సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) మనందరికీ సుపరిచితమే. సినిమా ఏదైనా సరే తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక మాస్ సినిమాలకు తమన్ అందించే సంగీతానికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమన్ ఓ రేంజ్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారనే విషయం తెలిసిందే. అలా ‘అఖండ’(Akhanda), ‘భగవంత్ కేసరి’(Bhagavanth Khesari), ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలతో తమన్ నందమూరి అభిమానుల ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు.
ఫ్యాన్స్ ఇప్పుడు తమన్‌ను నందమూరి తమన్ అని సరదాగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తమన్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఓ నెటిజన్.. మాకు ఓజీ నుంచి అప్డేట్ కావాలి.. వారు అతన్ని ఓజీ అని పిలుస్తున్నారంటూ డీవీవీ మూవీస్ అండ్ తమన్‌ను ట్యాగ్ చేశాడు. అంతేకాకుండా ‘దె కాల్ హిమ్ ఓజీ’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీనికి తమన్ స్పందిస్తూ.. ‘వావ్.. పోస్టర్ అదిరింది గురు అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’(OG) నుంచి మ్యూజిక్, సినిమా అప్డేట్స్ కోసం కోటి కళ్లతో ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.