- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa 2: ఒక్క హిందీలోనే పుష్ప 2 వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందా?
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సినిమా "పుష్ప 2" (Pushpa 2). సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 5 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మొదటి రోజే దేశ వ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ మూవీస్ లో చరిత్ర సృష్టించింది. నార్త్ లో కూడా దూసుకెళ్తుంది. అయితే, హిందీలో ఎవరు ఊహించలేని విధంగా ఈ సినిమాని ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ పుష్పా రాజ్ దూసుకెళ్తున్నాడు. డిసెంబర్ 05 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే హిందీలో రూ.72 కోట్ల కలెక్షన్లు మాత్రమే వసూలు చేయగా.. రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లు, నాలుగో రోజు రూ. 86 కోట్లు, ఐదో రోజు రూ. 48 కోట్లు, ఆరో రోజు రూ.36 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు, పదకొండు రోజుల్లో రూ.561.50 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో ఒక్క హిందీలోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి ఆ బెంచ్ మార్క్ ను అందుకుంటుందో? లేదో ? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.