విశ్వక్ సేన్ ‘లైలా’ ట్రైలర్ వచ్చేస్తుందోచ్.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Kavitha |   ( Updated:2025-02-06 11:46:02.0  )
విశ్వక్ సేన్ ‘లైలా’ ట్రైలర్ వచ్చేస్తుందోచ్.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్‌, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది. ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ.. మూడు చార్ట్‌‌బస్టర్ సాంగ్స్‌ తర్వాత లైలా టీజర్ ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా విశ్వక్ సేన్ ‘వెళ్లి పోమాకే’(Vellipomake) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’(Ee nagaraniki emaindhi), ‘ఫలక్‌నుమాదాస్’(Falaknuma Das), ‘హిట్’(HIT), ‘పాగల్’(Pagal), ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’(Ashokavanam Lo Arjuna Kalyanam), ‘ఓరి దేవుడా’(Ori Devuda), ‘ముఖ చిత్రం’(Mukha Chithram), ‘హిట్-2’(Hit-2), ‘దాస్ కా ధమ్కీ’(Das Ka Dhamki), ‘బూ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari), ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం లైలా మూవీతో పాటు ఫంకీ(Funkey) సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Next Story

Most Viewed