Vijay DevaraKonda : గద్దర్ సాంగ్ తో కోల్డ్ ప్లే మాషప్ చేయండి ప్లీజ్ : రౌడీ బాయ్

by M.Rajitha |
Vijay DevaraKonda : గద్దర్ సాంగ్ తో కోల్డ్ ప్లే మాషప్ చేయండి ప్లీజ్ : రౌడీ బాయ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ "కోల్డ్ ప్లే"(Cold Play) ఇటీవల గుజరాత్(Gujarath) లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో భారీ కన్సర్ట్(Concert) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కోల్డ్ ప్లే కన్సర్ట్ లో సింగర్ క్రిస్ మార్టిన్(Chris Martin) తాను తెలంగాణ వాడినని చేసిన ర్యాప్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మార్టిన్ కు స్వాగతం పలికాడు. ఎవరైనా ఈ కోల్డ్ ప్లే వీడియోకి గద్దర్(Gaddar) పాడిన ప్రముఖ సాంగ్ "పొడుస్తున్న పొద్దుమీద"(Podusthunna Poddumida) సాంగ్ మాషప్ చేయాలని కోరాడు. ఈ మేరకు విజయ్ తన ఇన్స్టాగ్రామ్(Instagram) లో ఓ పోస్ట్ చేశాడు. అయితే దీనిని క్రిస్ మార్టిన్ తో సహ పలువురు స్వాగతించడం గమనార్హం. కాగా, 21st సెంచరీలో ఆసియాలో అత్యధిక మంది హాజరైన కన్సర్ట్ గా కోల్డ్ ప్లే కన్సర్ట్ నిలిచింది. దీనికి 1,35,000 మంది హాజరయ్యారు.





Next Story

Most Viewed