Pawan Kalyan: హరిహరవీరమల్లు షూటింగ్ నుంచి వీడియో లీక్.. అదిరిపోయిన పవర్‌స్టార్ మీసం మెలేస్తున్న విజువ‌ల్స్

by Anjali |   ( Updated:2024-12-03 11:17:05.0  )
Pawan Kalyan: హరిహరవీరమల్లు షూటింగ్ నుంచి వీడియో లీక్.. అదిరిపోయిన పవర్‌స్టార్ మీసం మెలేస్తున్న విజువ‌ల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Powerstar Pawan Kalyan) రాజకీయ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోవడంతో దర్శకనిర్మాతలతో ఒప్పందం కుదర్చుకున్న సినిమాలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇక ఎన్నికల అనంతరం పవర్‌స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి(Deputy Chief Minister of Andhra Pradesh)గా స్థానం దక్కించుకున్నారు. అప్పటినుంచి ప్రజలకు సేవ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే మూడు చిత్రాలు పెండింగ్‌లో ఉండగా.. అందులో హరిహర వీరమల్లు(Hariharaveeramallu) ఒకటి చిత్రషూటింగ్ చివరి దశలో ఉంది. కాగా దర్శకనిర్మాతలు పవన్ డేట్స్ కోసం సంప్రదించగా.. డిప్యూటీ సీఎం ఓకే చెప్పారు. ప్రస్తుతం పవర్‌స్టార్ ఈ చిత్ర షూటింగ్‌‌లో పాల్గొంటున్నారు. జ్యోతికృష్ణ(Jyotikrishna) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ మంగళగిరి(Mangalagiri)లో చిత్రీకరణ జరుగుతుంది.

అయితే తాజాగా ఈ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోలో ఫొటోమెట్రిక్ 3 డీ స్కానింగ్ టెక్నాలజీ(Photometric 3D scanning technology) వాడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రౌండప్‌గా ఉన్న లైట్లు, కెమెరాల మధ్య పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మీసం మెలేస్తూ వేరే లెవల్ ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక నిధి అగర్వాల్(Nidhi Aggarwal,), అర్జున్ రాంపాల్(Arjun Rampal), బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(Bollywood actor Anupam Kher), నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri).. తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం వచ్చే ఏడాది (2025) మార్చి 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Advertisement

Next Story