- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
GHMC: గ్రేటర్‌లో చెత్త కేంద్రాలు.. చెత్త వేసిన కనిపించకుండ ప్రత్యేక క్యాబిన్

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్‌లో చెత్త సమస్యను పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ(GHMC) కొత్త ప్రణాళికను రూపొందించింది. చెత్త పేరుకుపోకుండా చేయడంతో పాటు.. చెత్త కనిపించకుండా ఉండడానికి ప్రత్యేక క్యాబిన్(Separate Cabin) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బుధవారం మలక్‌పేట్(Malakpet) సర్కిల్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట్(Old Malakpet) ఏరియాలో గార్బేజ్ కలెక్షన్ సెంటర్ పేరుతో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ఖర్చును రాంకీ సంస్థనే భరిస్తుందని అధికారులు చెబుతున్నారు.
1,500 జీవీపీలు..
డస్ట్ బిన్(Dust Bin)లను తొలగించి బిన్ ఫ్రీ సిటీగా మార్చిన చెత్త సమస్య తప్పడంలేదు. డస్ట్ బిన్ లేకపోయినా ఎక్కడిపడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ఈ చెత్త పాయింట్లను ‘గార్బేజ్ వర్నరబుల్ పాయింట్(GVP)’గా గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1500 జీవీపీలు ఉండగా వీటిలో తీవ్రమైన చెత్త ప్రాంతాలు 475 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ జీవీపీల్లో కార్మికులు ముగ్గులు వేయడంతో పాటు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని కాపలగా పెట్టిన చెత్త పేరుకుపోతూనే ఉంది.
150 గార్బేజ్ కలెక్షన్ సెంటర్లు..
చెత్త ఎక్కువగా పేరుకుపోతున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో గార్బేజ్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 475 తీవ్రమైన చెత్త ఉత్పత్తి ప్రాంతాల్లో మొదటి దశలో 150 సెంటర్లలో చెత్త కోసం ప్రత్యేక క్యాబిన్‌లో రెండు డస్ట్ బిన్‌లు ఉంటాయి. చెత్త వేసినా.. వాటిలో పడకపోయిన.. పౌరులకు కనిపించకుండా ఉండేలా క్యాబిన్‌ను రూపొందించారు. ముఖ్యంగా మురికివాడల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పెనాల్టీ వేసేందుకు మొబైల్ యాప్..
మురికివాడల్లో గార్బేజ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లకు సంబంధించిన చెత్తను సైతం ఎక్కడిపడితే అక్కడ వేస్తున్నట్టు గుర్తించారు. దీన్ని అరికట్టడానికి భారీగా పెనాల్టీ వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ తయారు చేస్తున్నట్టు అదనపు కమిషనర్(శానిటేషన్) సీఎన్.రఘుప్రసాద్(CN. Raghuprasad) తెలిపారు.