FIR Filed: పుష్ప-2 ప్రిమియర్‌ షోలో తొక్కిసలాట.. ఆ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

by Shiva |   ( Updated:2024-12-05 03:12:34.0  )
FIR Filed: పుష్ప-2 ప్రిమియర్‌ షోలో తొక్కిసలాట.. ఆ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్/చైతన్యపురి: సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మికా మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. ఈ మేరకు రెండు బుధవారం రాత్రి నుంచి బెనిఫిట్‌ షో (Benifit Show)ల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ (Hyderabad)లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద విషాదం చోటుచేసుకుంది. అయితే, ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ (Allu Arjun) అక్కడి రాగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.

అయితే, ప్రిమియర్ షో (Premiere Show) చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar) నుంచి రేవతి (39), భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్ (9), సన్వీక (7) సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి, కుమారుడు శ్రీతేజ్ ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన పోలీసులు రేవతికి సీపీఆర్ (CPR) చేసినా లాభం లేకపోవడంతో ఆమెను విద్యానగర్‌లోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే రేవతి ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అదేవిధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు తొక్కిసలాటకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read More : తొక్కిసలాటలో మహిళ మృతి.. హీరో అల్లు అర్జున్, పోలీసులే బాధ్యత వహించాలని కుటుంబ సభ్యుల డిమాండ్

Next Story