- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Varalakshmi Sarath Kumar: ఫస్ట్‌లో నాలో అది బాగోలేదు అన్నారు.. ఇప్పుడు అదే నాకు ప్లెస్ అయింది.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) తాజాగా ‘మదగజరాజా’ (Madagajaraja) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిదే. విశాల్ (Vishal) హీరోగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మితో పాటు అంజలి (Anjali) కూడా హీరోయిన్‌గా నటించింది. డైరెక్టర్ సుందర్ సి (Sundar C) తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. 12 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ మూవీ తాజాగా సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
ఇక చిత్ర బృందం కూడా తగ్గేదే లేదు అన్నట్టు వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ స్టార్టింగ్‌లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ‘స్టార్టింగ్‌లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా వాయిస్ గురించి కామెంట్స్ చేసేవాళ్లు. ఈ వాయిస్‌లో ఎలా చేస్తావు. ఎవరినో ఒకరిని డబ్బింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లు. కానీ నా వాయిసే ప్లెస్ అయింది. ఒక్కోసారి అదే అనిపిస్తుంది... నెగిటివ్ అనుకున్నదే ప్లెస్ అవుతుంది అని’ అంటూ చెప్పుకొచ్చింది.