‘దబిడి దిబిడి’ సాంగ్‌లోని ఆ స్టెప్స్ పై స్పందించిన ఊర్వశీ రౌతేలా.. గట్టిగా ఇచ్చిపడేసిందిగా

by Kavitha |   ( Updated:2025-01-16 04:13:32.0  )
‘దబిడి దిబిడి’ సాంగ్‌లోని ఆ స్టెప్స్ పై స్పందించిన ఊర్వశీ రౌతేలా.. గట్టిగా ఇచ్చిపడేసిందిగా
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal, శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మించారు. ఇక ఇందులో ఊర్వశీ రౌతేల(Urvashi Rautela) ఐటెమ్ సాంగ్‌లో చిందులేసింది. అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘డాకు మహారాజ్’ సినిమాలో ఐటెం సాంగ్(Item song) అయిన ‘దబిడి దిబిడి’(Dabidi Dibidi) ఎంతగా ట్రెండ్ క్రియేట్ సెట్ చేసిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అయితే ఇందులో చాలా స్టెప్స్ పై విమర్శలు వచ్చినా ఒక స్టెప్ మాత్రం వివాదాస్పదంగా మారింది. తాజాగా దీనిపై ఊర్వశీ రౌతేలా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణతో డ్యాన్స్, నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలనైనా నేను గౌరవిస్తాను.

ఆయన లెజెండ్. ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇదంతా కళలో భాగం. బాలకృష్ణతో డ్యాన్స్ చేయడం కేవలం పర్ఫామెన్స్ మాత్రమే కాదు, కళపై నాకున్న గౌరవానికి చేసుకున్న వేడుకగా భావిస్తాను. ఆయనతో పని చేయడం నా కల. ఈ సినిమాతో అది నెరవేరింది. ఆయన ఆర్టిస్టులను ఎంతో సపోర్ట్ చేస్తారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

( Photo Credits to URVASHI RAUTELA Instagram )

Next Story

Most Viewed