- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Maha KumbhMela: మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మనసు తేలికపడిందంటూ పోస్ట్

దిశ, సినిమా: ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ సంయుక్త (Samyukta).. ‘బింబిసార, సర్, విరూపాక్ష’ వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ (Full craze) తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తున్న స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ సంయుక్త చేతిలో ‘స్వయంభు’ (Swayambhu)తో పాటు పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా టైటిల్స్ ఇంకా ఫిక్స్ కాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha KumbhMela)కు వెళ్లి త్రివేణి సంగమం(Triveni Sangam)లో పవిత్ర స్నానం చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక X ద్వారా తెలియజేస్తూ.. ‘జీవితంలో విశాలతను మనం కళ్లారా చూసినప్పుడు దానికి మించింది మరోకటి లేదు అనిపిస్తుంది. అనంతమైన స్ఫూర్తి కోసం నా సంస్కృతిని నేను ఎంతో ఆదరిస్తాను. మహాకుంభంలో గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తున్నప్పుడు నా మనసు ముంచువలె తెలికపడింది’ అంటూ స్నానం చేస్తున్న ఫొటో షేర్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.