Krithi Shetty: కూల్ లుక్‌లో కృతి శెట్టి..

by sudharani |   ( Updated:2024-10-29 14:35:02.0  )
Krithi Shetty: కూల్ లుక్‌లో కృతి శెట్టి..
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’ (Uppena Movie) సినిమాతో టాలీవుడ్ (Tollywood News) ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి (Krithi Shetty).. మొదటి మూవీతోనే ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇంస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అయితే.. ‘ఉప్పెన’ మూవీ తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో వరుస ఫ్లాపులు రావడంతో ఈ బ్యూటీ గ్రాఫ్ కూడా డౌన్ అయింది. ఇక ఇటీవల శర్వానంద్ (Sharwanand) ‘మనమే’ చిత్రం(Maname movie)తో వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు.

అయితే.. ప్రజెంట్ తెలుగులో ఏ మూవీ అనౌన్స్ చెయ్యని కృతి.. మలయాళ, తమిళంలో మాత్రం సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఇక సినిమా విషయాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కృతి శెట్టి ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచి గ్లామరస్ ఫొటోలతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫేషన్ పేజ్‌లో మెరిసిన ఈ బ్యూటీ.. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో లైట్ కలర్ డ్రెస్‌లో కూల్ లుక్‌తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story