Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘NKR-21’ సినిమాకు అదిరిపోయే టైటిల్.. హైప్ పెంచుతున్న పోస్టర్

by Hamsa |   ( Updated:2025-03-08 13:58:00.0  )
Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘NKR-21’ సినిమాకు అదిరిపోయే టైటిల్.. హైప్ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: నందమూరి(Kalyan Ram) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ వైపు నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరో వైపు వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘NKR-21’. ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని అశోక క్రియేషన్స్(Ashoka Creations), ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి విజయశాంతి (Vijayashanti)కీలక పాత్రలో కనిపించనుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన పలు టైటిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘NKR-21’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ పేరును ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. విజయశాంతి పోలీస్ డ్రెస్‌లో కనిపించడంతో సినిమాలో విజయశాంతి పోలీసాఫీసర్ అని, ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ కూడా పోలీస్ గా నటించబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story

Most Viewed