Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు.. వైరల్‌గా మారిన మోహన్ బాబు పోస్ట్

by Hamsa |
Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు.. వైరల్‌గా మారిన మోహన్ బాబు పోస్ట్
X

దిశ, సినిమా: మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj) మధ్య గొడవ జరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ఈ మేరకు ఇద్దరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారని పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే.. మోహన్ బాబు స్పందించి ఇవన్నీ అబద్ధాలు అని అందులో ఎలాంటి నిజం లేదని నమ్మకూడదని చెప్పారు. ఇక ఈ విషయం వెల్లడైన కాసేపటికే మంచు మనోజ్(Manchu Manoj) నడవలేని స్థితిలో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఆయనకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, మోహన్ బాబు ఓ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. ‘‘కోరికలే గుర్రాలైతే (1979): నా గురువు, లెజెండరీ శ్రీ. దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) గారు, నిర్మాత శ్రీ. జి. జగదీష్ చంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్ గారు, శ్రీ. మురళీ మోహన్(Murali Mohan) గారు గుర్తుండిపోయేలా చేశారు.

తొలిసారిగా యమ ధర్మరాజు పాత్ర చేయడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఈ సన్నివేశం ఒక సవాలు మాత్రమే కాదు.. ఎంతో సంతోషాన్ని కలిగించేదిగానూ ఉంది. ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా మారింది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఈ పోస్ట్ పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed