Alekhya Reddy: ఇది మాన్పలేని గాయం.. మేము చాలా మిస్ అవుతున్నామంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Alekhya Reddy: ఇది మాన్పలేని గాయం.. మేము చాలా మిస్ అవుతున్నామంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: నందమూరి తారకరత్న(Taraka Ratna) పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన 2023లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy), పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తారకరత్న మరణించనప్పటికీ నుంచి ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూ తన బాధను వ్యక్తపరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె తన పిల్లల గురించి పలు విషయాలు వెల్లడిస్తోంది.

తాజాగా, నేడు తారకరత్న రెండవ వర్ధంతి కావడంతో ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘విధి నిన్ను మా నుండి దూరం చేసిన రోజున ఈ లోకంలో ఏదీ పూరించదు.. నిన్ను కోల్పోయిన బాధ కాలం మాన్పలేని గాయం. ఏదీ భర్తీ చేయలేని హృదయ విదారకం. మేం ఇలా విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు.. నువ్వు ఇక్కడ లేకపోవచ్చు కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు విడిచిన కలల్లో, మసకబారడానికి నిరాకరించే ప్రేమలో ఉంటుంది. మేము నిన్ను మాటలకు మించి, కాలానికి మించి, జీవితానికి మించి మిస్ అవుతున్నాము’’ అని రాసుకొచ్చింది. అలాగే తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మేము కూడా చాలా మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed