- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sundeep Kishan: రెండేళ్లు ఖాళీగా కూర్చోబెట్టి మోసం చేశారు.. సందీప్ కిషన్ కీలక వ్యాఖ్యలు
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan),త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘మజాకా’(Mazaka ) మూవీ చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్న ఆయన హిందీలో నటించకపోవడానికి కారణమేంటో వెల్లడించాడు. ‘‘నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. అయితే అవి రెండు పెద్ద నిర్మాణ సంస్థల బ్యానర్స్‌లో తెరకెక్కిస్తుండటంతో చాలా ఎక్జయిట్ అయ్యాను.
కానీ ఓ రెండేళ్ల పాటు ముంబై(Mumbai)లో ఖాళీగా నన్ను కూర్చోబెట్టారు. అప్పుడు మూడు చిత్రాలు నా చేతిలో ఉన్నప్పటికీ నేను ఆసక్తి చూపించలేదు. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా అని వేరే ఆఫర్లు వదులుకున్నాను. అంత వెయిట్ చేసినప్పటికీ వాటిని వేరే వారితో చేయించారు. మోసపోయాను అనిపించింది. అందుకని హిందీ భాషలో నటించకూడదని అనుకోలేదు కానీ నిజయితీగా ఉంటూ నా భాషలోనే చేయాలనుకున్నాను. నేను హిందీలో నటిస్తే అందరికీ నచ్చుతుంది అనుకుంటే తెలుగు చిత్రాలనే బాలీవుడ్‌లో రిలీజ్ చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు.