- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chhaava Telugu Trailer : డైలాగ్స్‌తో విక్కీ కౌశల్ గూస్ బమ్స్ తెప్పించాడుగా

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా కథ, విక్కీ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేస్తున్నారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయడంతో మిగతా భాషల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geeth Arts) డిస్ట్రిబ్యూషన్స్ మార్చి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేసింది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్(Telugu Trailer) నేడు రిలీజ్ అయింది. అందులో విక్కీ కౌశల్ చెప్పిన డైలాగ్స్ గూస్ బమ్స్ తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఇక ట్రైలర్‌ను గమనించినట్లయితే.. ‘ ఛత్రపతి శివాజీ.. జనం చేరుకున్నారు జనా’ అంటూ టైటిల్ నేమ్స్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ శంభాజీ మహారాజ్ ఎంట్రీతో అదిరిపోయింది. మరాఠా సామ్రాజ్యానికి ఎవరు అడ్డు వచ్చినా చీల్చి చెండాడుతాను అనే డైలాగ్ గూస్ బమ్స్ తెప్పించాయి. అలాగే రష్మిక ఎంట్రీ సీన్స్, యాక్షన్ సీన్స్, విజువల్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని అన్ని హైలెట్‌గా నిలిచాయి. మొత్తానికి ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.