- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. నా అమెజాన్ గ్రీన్ ఫారెస్ట్‌ని వివాహమాడానంటూ పోస్ట్
దిశ, సినిమా: ప్రముఖ మలయాళ సింగర్ అంజు జోసెఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ.. ‘డాక్టర్ లవ్’ సినిమాలోని చిల్లానే పాటతో మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో పాటలు పాడి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఈ భామ వాయిస్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పోచ్చు. అయితే ఈ బ్యూటీ కేవలం సింగర్‌గానే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అలా తొలిసారి ‘అర్చన 31 నాటౌట్’ అనే మూవీలో నటించింది. అయితే గతంలో అంజు స్టార్ మ్యాజిక్ సీరియల్ డైరెక్టర్ అనూప్ జాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. అంజు జోసెఫ్ తాజాగా మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఆదిత్య పరమేశ్వరన్‌ను సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత శనివారం అతిథుల కోసం వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ఇక ఈ వేడుకలో పలువురు సినీ తారలు పాల్గొన్నారు. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.