నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రాబోతుందంటూ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Kavitha |   ( Updated:2025-03-01 06:46:32.0  )
నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రాబోతుందంటూ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) గత ఏడాది ‘సరిపోదా శనివారం’(saripoda Sanivaram) సినిమాతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise) ఒకటి. ‘దసరా’(Dasara) వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మరో సినిమా కావడంతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాపై ప్రేక్షకుల్లె భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే ఆ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukoori) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14న థియేటర్లలోకి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. రా స్టేట్‌మెంట్.. ది ప్యారడైజ్ నుంచి గ్లింప్స్(Glimps) మార్చి 3(3.3.25)న రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. కాకి చాలా సీరియస్‌గా చూస్తుంది. అలాగే దాని కళ్లలో ఫైర్ కనిపిస్తుంది. మొత్తానికి క్రో చూడటానికి చాలా గంభీరంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Next Story