- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TV Actors: భర్తకి చీర కట్టి అమ్మాయి గెటప్ లో రెడీ చేస్తున్న బుల్లితెర నటి .. వైరల్ అవుతున్న వీడియో

దిశ, వెబ్ డెస్క్ : " నేను శైలజ " సీరియల్ లో జంటగా నటించిన హారిక – ఏక్ నాథ్ ( Harika - Eknadh ) పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఆ సీరియల్ చేసేటప్పుడు వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. కట్ చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకుని .. దంపతులుగా మారారు.
ఇక, పెళ్లి తర్వాత గ్యాప్ లేకుండా హారిక – ఏక్ నాథ్ ( Harika - Eknadh ) ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. అలా రియాల్టీ షోస్ లో కూడా జంటగా వెళ్ళారు. ఖాళీ సమయం దొరికితే యూ ట్యూబ్ లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తారు. అలా వీళ్ళు షేర్ చేసిన వీడియోస్ చాలానే వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా పుష్ప 2 జాతర గెటప్ లో ఏక్ నాథ్ రెడీ అయ్యాడు. ఇప్పటికే, ఎంతో మంది ఈ గెటప్ వేసుకున్నారు.
ఏక్ నాథ్ రెడీ అయ్యే వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. భర్త కి దగ్గరుండి చీర కట్టి , నగలు పెట్టి , కాళ్ళకి పారాణి పెట్టి అందంగా రెడీ చేసింది. అతనంటే ఎంత ప్రేమో ఇక్కడే తెలుస్తుంది. ఇది చూసిన నెటిజన్స్ వామ్మో మేము అస్సలు ఊహించలేదు .. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్, తగ్గేదేలా, ఏక్ నాధ్ ఇలాంటి గెటప్ వేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.