Republic Day: రిపబ్లిక్ డే స్పెషల్‌గా ‘ది దిల్లీ ఫైల్స్’ టీజర్..

by sudharani |
Republic Day: రిపబ్లిక్ డే స్పెషల్‌గా ‘ది దిల్లీ ఫైల్స్’ టీజర్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) సినిమాతో సంచలనం సృష్టించారు. అంతేకాకుండా భారీ విజయాన్ని సాధించడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ప్రజెంట్ వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో ‘ది దిల్లీ ఫైల్స్’ (The Delhi Files) రాబోతుంది. ‘ది బెంగాల్ చాప్టర్’ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ‘ది దిల్లీ ఫైల్స్’ చిత్రం నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

‘మేము, భారతదేశ ప్రజలం. భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అలాగే పౌరులందరికీ సురక్షితంగా ఏర్పాటు చేయాలని గంభీరంగా నిర్ణయించడం...’ అని బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్రవ‌ర్తి (Mithun Chakraborty) రాజ్యంగంలోని భారత రాజ్యాంగ ప్రవేశికను చ‌దువుతూ న‌డుస్తున్నట్లు ఈ టీజర్‌ను క‌ట్ చేశారు మేక‌ర్స్. ప్రజెంట్ ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. కాగా.. ‘ది దిల్లీ ఫైల్స్’ ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.




Next Story