- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘తండేల్’ కలెక్షన్ల ప్రభంజనం.. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?(ట్వీట్)

దిశ, సినిమా: గత మూడేళ్లుగా మంచి హిట్ లేక ఫ్లాప్స్‌తో సతమతం అవుతోన్న అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో క్రేజీ డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti) డైరెక్షన్‌లో ‘తండేల్’ చిత్రంతో మనముందుకు వచ్చాడు. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించింది.
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించారు. సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.21.27కోట్ల గ్రాస్‌ను రాబట్టిన తండేల్ మూవీ రెండో రోజు రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలో ఈ సినిమా మూడో రోజు కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.62.37 కోట్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. యువ సామ్రాట్ చైతూ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన కలెక్షన్లు అని తెలుపుతూ.. స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన అక్కినేని ఫ్యాన్స్.. ఇంకో 2డేస్‌లో 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోతుంది, కేక్ రెడీ చేసి పెట్టుకోండి అబ్బాయిలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.