‘ఆ కారణం వల్లే నేను మతం మార్చుకోవాల్సి వచ్చింది’.. సాయి ధరమ్ తేజ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
‘ఆ కారణం వల్లే నేను మతం మార్చుకోవాల్సి వచ్చింది’.. సాయి ధరమ్ తేజ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘శివ మనసులో శృతి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘పిల్ల నువ్వు లేని జీవితం’, ‘పవర్’, ‘రారా కృష్ణయ్య’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సౌఖ్యం’, ‘ఆచార్య’, ‘శాకిని డాకిని’, ‘నేనే నా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లోనూ నటించింది. అక్కడ కూడా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే కొన్ని వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామ అజిత్ హీరోగా నటిస్తున్న ‘విడాముచార్చి’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “మా అమ్మ క్రిస్టియన్, కానీ మా నాన్న మాత్రం ఇస్లాం మతానికి చెందిన వారు. అయితే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నేను పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలిగా పెరిగాను. కానీ, నేను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే మా అమ్మ నాన్న విడిపోయారు. అప్పుడు మా అమ్మ తిరిగి నన్ను క్రిస్టియన్‌గా కన్వర్ట్ చేసి రెజీనా పేరుకు ‘కసాండ్రా’ అని జత చేశారు. దీంతో నేను బాప్తిసం పొంది బైబిల్ చదివాను. అలా నేను రెజీనా కసాండ్రాగా అందరికీ పరిచయం అయ్యాను. వాస్తవానికి నా అసలు పేరు రెజీనా మాత్రమే. ఇక మతం విషయంలో నాకు ఎలాంటి పట్టింపులు లేవు. నేను చర్చి, మసీదు, గుడి.. ఇలా ఎక్కడికైనా వెళతాను” అంటూ రెజీనా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed