- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీ కూతుర్లను రక్షించుకోవాలంటే అదొక్కటే మార్గం.. చిన్మయి సెన్సేషనల్ ట్వీట్

దిశ, సినిమా: ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) అందరికీ సురపిచితమే. ఆమె పలు సాంగ్స్ పాడటంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించి నెట్టింట తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. గతంలో మీటూ ఉద్యమంలో లిరిక్ రైటర్ వైరముత్తుపై కూడా ఆమె లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసింది. ఇక అప్పటి నుంచి పాటలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
నిత్యం ఏదో దానిపై స్పందిస్తుంటుంది. అయితే ఇటీవల అలహాబాద్ హైకోర్ట్ ఒచ్చిన తీర్పుపై చిన్మయి కూడా తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. అసలు విషయంలోకి వెళితే.. ఈ కేసు 2021లో జరిగిన సంఘటనకు సంబంధించినది కాగా.. పవన్, ఆకాశ్ అనే వ్యక్తులు ఒక 11 ఏళ్ల చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితులు బాధిత చిన్నారి స్తనాలను పట్టుకుని, ఆమె పైజామా స్ట్రింగ్‌ను విరిచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ చుట్టుపక్కన ఉన్న ప్రజలు చూసి ఆ బాలికను కాపాడరు. అయితే ఈ విషయంపై పవన్, ఆకాశ్‌పై రేపు కేస్ నమోదు అవ్వగా.. హైకోర్ట్ స్పందిస్తూ.. ఈ చర్యలు రేప్‌గా పరిగణించలేమని తెలిపింది.
దీనిని పోక్సో చట్టం కింద లైంగికదాడిగా పరిగణించవచ్చని వెల్లడించింది. ఇక అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ తీర్పుపై చిన్మయి స్పందిస్తూ.. ‘‘భారతదేశం రేప్ క్యాపిటల్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చును. మీకు సామర్థ్యం ఉంటే.. అవకాశం వస్తే మీ కూతురితో కలిసి ఇండియా వదిలి వెళ్లిపోండి. లేదా మీ కూతురుని అయిన ఇండియాను వదిలి వెళ్లిపోమని చెప్పండి. మీ కూతుర్లను రక్షించుకోవడానికి అదొక్కటే మార్గం. కాబట్టి ఒకసారి అందరూ బాగా ఆలోచించుకోండి’’ అని రాసుకొచ్చింది. అలాగే ఇ తీర్పుకు సంబంధించిన వార్తను కూడా షేర్ చేసింది. ఇక చిన్మయి పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఇండియాలో ఉంటూ అలా తప్పుగా మాట్లాడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More..
జాక్ నుంచి 'కిస్' సాంగ్ రిలీజ్.. రొమాంటిక్ లిరిక్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందిగా..