Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో విలన్స్‌గా ఆ స్టార్ కపుల్?

by Hamsa |
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో విలన్స్‌గా ఆ స్టార్ కపుల్?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన ‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ డార్లింగ్ నటిస్తున్న రాజా సాబ్, షూటింగ్ దశలో ఉంది. ఆయన కల్కి-2, సలార్-2 తో పాటు హను రాఘవ పూడి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో నటించబోయే నటీనటుల గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా, స్పిరిట్ సినిమాలో విలన్స్‌గా స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌లను సందీప్ రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిని ఇందులో క్రూయల్ వైఫ్ అండ్ హస్బెండ్‌గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వారికి ఈ పాత్రలు బాగా నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నారని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఒక బొమ్మ అదిరిపోద్ది అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story