- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tollywood: బయట హీరోతో సినిమా చేసి హ్యాట్రిక్ హిట్ కొడతానంటున్న తెలుగు డైరెక్టర్..!

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రి ( Telugu Movie industry ) స్థాయి పాన్ ఇండియాకు వెళ్ళడంతో మన దర్శకులపై ఇతర ఇండస్ట్రీలోని హీరోలకు నమ్మకం వచ్చేసింది. అందుకే వేరే సినీ ఇండస్ట్రీ హీరోలు మన దర్శకులతో పోటీ పడీ మరీ సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక టాలీవుడ్ డైరెక్టర్ బయట హీరోలనే నమ్ముకుని సినిమాలు తీస్తున్నాడు. ఆ దర్శకుడు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
డైరెక్టర్ వెంకీ అట్లూరి ( Venky Atluri ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. డైరెక్టర్ గా తన ఫస్ట్ మూవీ " తొలిప్రేమ " ( Tholi Prema ) సూపర్ హిట్ అయిన ఆ తర్వాత " మిస్టర్ మజ్ను " , " రంగ్ దే " మూవీస్ యావరేజ్ గా ఆడాయి.
హీరో ధనుష్ తో సితార ఎంటెర్టైన్మెట్స్ లో ‘సర్’ ( sir movie ) మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఒక కొత్త కథని తీసుకొని మెసేజ్ ఇస్తూ తెలుగు, తమిళ్ లో విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో " లక్కీ భాస్కర్ " ( Lucky Baskhar) చిత్రం తీసి మరో హిట్ కొట్టాడు. మిడిల్ క్లాస్ పీపుల్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇలా బయట హీరోలతోనే సినిమాలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.తనకు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే వెంకీ అట్లూరి నెక్స్ట్ మూవీ తమిళ్ స్టార్ హీరో సూర్యతో ( Suriya ) చేయబోతున్నారని టాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.