Jani Master: జానీ మాస్టర్కు గుమ్మడికాయతో దిష్టి తీసిన ఆ సినిమా మేకర్స్.. కన్నీరు పెట్టుకున్న కొరియోగ్రాఫర్

by Prasanna |   ( Updated:2025-02-04 02:35:29.0  )
Jani Master: జానీ మాస్టర్కు గుమ్మడికాయతో దిష్టి తీసిన ఆ సినిమా మేకర్స్.. కన్నీరు పెట్టుకున్న కొరియోగ్రాఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఊహించలేని ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Jani Master ) కేసు కూడా ఉంది. ఈయన లైంగిక వేధింపుల కేసు మీద అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చి చాలాకాలం తర్వాత ఓ మూవీ సెట్లోకి అడుగుపెట్టారు. ఈ మూవీ షూటింగ్ బెంగళూరులో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా మేకర్స్ జానీ మాస్టర్ కు వెల్కమ్ చెప్పారు.

ఆయన సెట్ కు వెళ్ళగానే మేకర్స్ గుమ్మడికాయ, కొబ్బరికాయతో దిష్టి తీసి కేక్ కట్ చేయించి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. వాళ్లు చూపించిన ప్రేమకు జానీ ( Jani Master ) కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరికీ నమస్కారం చేసి చాలా థాంక్స్ అని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే, ఇంతకీ ఆ సినిమా ఏదనేది తెలియాల్సి ఉంది.

"చాలా కాలం తర్వాత బెంగళూరుకు వచ్చాను. యూవర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్‌లో అడుగుపెట్టిన నాకు హ్యాపీగా ఉంది. గుర్తుండిపోయే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు థాంక్స్. నన్ను సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీమ్ అందరికీ ధన్యవాదాలు." అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ " ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ " అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాగే సినిమాలు చేస్తూ మీరు మళ్లీ ఫుల్ బిజీ కావాలని.. మీకు మిస్ అయిన నేషనల్ అవార్డు మళ్లీ రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జానీ మాస్టర్ పై ఓ లేడి కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టగా ఆయన జైలుకెళ్లి బెయిల్ పై రిలీజ్ అయిన మనందరికీ తెలిసిందే. బెయిల్ నుంచి బయటకొచ్చిన జానీకి సినీ ఇండస్ట్రీలో మళ్లీ అవకాశాలు వస్తాయా.. రావా అని ఎంతో మంది అనుకున్నారు. ఇప్పుడు, ఓ చిత్రంలో ఆఫర్ రావడంతో జానీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక తనపై నమోదైన కేసుపై జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. " నేను ఏ తప్పూ చేయలేదు.. విచారణ పూర్తయిన తర్వాత అన్ని బయటికొస్తాయని " చెబుతున్నారు.

Next Story