- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోహన్‌లాల్ ‘L2:ఎంపురాన్’ ట్రైలర్ చూసి రివ్యూ ఇచ్చిన సూపర్ స్టార్.. ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘L2:ఎంపురాన్’(L2: Empuraan). అయితే ఈ చిత్రం 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ మూవీ మూడు భాగాలుగా రాబోతుండగా.. ఇది రెండో భాగం కావడం విశేషం. అయితే ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. కాగా ‘ఎంపురాన్-2’ను తెలుగు రాష్ట్రాల్లో దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) విడుదల చేస్తుంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్(Manju Warrier), సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు.
అలాగే ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్(Kartikeya Dev) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘L2E: ఎంపురాన్’సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth) ఎంపురాన్ ట్రైలర్ చూసి సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘నా ప్రియమైన మోహన్, పృథ్వీ నటించిన ఎంపురాన్ ట్రైలర్ చూశాను. పృథ్వీ గారి ఎంపురాన్ సినిమా అద్భుతం.. అభినందనలు.. ఈ సినిమా విడుదలకు టీం అందరికీ శుభాకాంక్షలు. దేవుడు ఆశీర్వదించాలి’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..
‘చీకటి గ్రహాల ఎంపురాన్’గా మలయాళ సూపర్‌స్టార్.. హైప్ పెంచుతున్న L2E: ఎంపురాన్ ట్రైలర్