SUPER HIT MOVIE: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ..

by Kavitha |
SUPER HIT MOVIE: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా వచ్చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దామా..

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’(Saripoda Sanivaram). ఈ సినిమా రేపటి నుంచి OTTలో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌(Net Flix)లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఆగస్టు 29న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా ఈ మూవీలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య(SJ Surya) విలన్‌గా నటించి మెప్పించారు.


Next Story

Most Viewed