పెండింగ్ బిల్లులపై సీఎం రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ డెడ్ లైన్

by M.Rajitha |   ( Updated:2024-09-25 11:18:51.0  )
పెండింగ్ బిల్లులపై సీఎం రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ డెడ్ లైన్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్Congress ప్రభుత్వం గ్రామ పంచాయితీలను, సర్పంచులను నిర్లక్ష్యం చేస్తోందని మంది పడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender). నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ(Pandith Deen Dayal Upadhyaya) జయంతి వేడుకల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను, గ్రామ పంచాయితీలను ఏమాత్రం పట్టించుకోలేదని.. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నిర్లక్ష్యం గురించి ప్రశ్నించి.. వారి ఓట్లు దండుకొని, ఇపుడు గ్రామ పంచాయితీలను పూర్తిగా విస్మరిమరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు గతంలో ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికీ అదే కొనసాగుతోందని అన్నారు. దసరా లోపు పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ విధించారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల తరపున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Advertisement

Next Story